News March 20, 2025

హిందూ గుళ్లపై ప్రభుత్వం పెత్తనం చేయొద్దు:సిర్పూర్MLA

image

హిందూ దేవాలయాలపై పెత్తనం చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ సహా ఇతర మైనార్టీ సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ గురించి అలాంటి ధోరణి కనబడటం లేదన్నారు. పురాతన దేవాలయాల నిర్వహణకు నోచుకోని ఆలయాల కోసం CGF నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

HYD: ఓయూ బంద్‌కు పిలుపు

image

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

News March 20, 2025

జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

image

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్‌ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.

News March 20, 2025

చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

error: Content is protected !!