News December 23, 2025

హిందూ మహిళలతోనూ అలానే చేయగలరా?: జావేద్ అక్తర్

image

బిహార్ CM నితీశ్ కుమార్ మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగడం<<>> విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ‘నితీశ్ చేసిన పని అసభ్యకరంగా ఉంది. ఇతరులను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ఏరియాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా ఘూంఘట్ (దుపట్టా, చీరకొంగు) కప్పుకుంటారు. వాటినీ లాగుతారా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 23, 2025

జామఆకులతో మొటిమలకు చెక్

image

సీజనల్‌గా దొరికే జామకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. కానీ.. జామకాయలే కాదు వాటి ఆకులూ మనకి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకులను పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. జామలోని విటమిన్-సి మొటిమలకు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

News December 23, 2025

ఈ అలవాట్లే క్యాన్సర్‌కు దారి తీస్తాయి

image

ఈ రోజుల్లో యువత అనుసరిస్తున్న కొన్ని అలవాట్లు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి శరీరంలోని సర్కాడియన్ రిథమ్‌ను దెబ్బతీసి, DNA మరమ్మతు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫైబర్ తక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారం శరీరం తినడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ D లోపం, స్మోకింగ్ చేయడం కూడా ప్రమాదకరమే.

News December 23, 2025

200 మంది ఇంజినీర్లతో ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక

image

TG: ఇరిగేషన్ ప్రాజెక్టులపై KCR విమర్శలను దీటుగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈనెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైనే ప్రధానంగా చర్చించనుంది. దీనికోసం 200 మంది ఇంజినీర్లతో సమగ్ర నివేదికనూ సిద్ధం చేయిస్తోంది. ప్రాజెక్టులకోసం INC చేసిన ప్రయత్నాలు, అనుమతుల సాధనలో గతంలో BRS వైఫల్యాలను ఆధారాలతో సహా ప్రజల ముందుంచాలని నిర్ణయించింది. CM రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రసంగించనున్నారు.