News November 2, 2024
హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన గుంటూరు విద్యార్థిని
గుంటూరు విద్యానగర్‌కు చెందిన పోతుగుంట్ల చందన అనే విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి గత నెల 11న 18 మంది విద్యార్థుల బృందం హిమాలయాలకు వెళ్లారు. ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంపులో భాగంగా చందన ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు నెలకొల్పింది. దేశంలో హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన తొలి ప్రైవేట్ కళాశాల కావడం విశేషమని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.
Similar News
News November 22, 2024
మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
మంత్రి నారా లోకేశ్‌ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై మంగళగిరి పట్టణ పోలీసు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన ఐ.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీముల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News November 22, 2024
గుంటూరు RRB అభ్యర్థులకు ముఖ్య గమనిక
సికింద్రాబాద్లో జరిగే RRB పరీక్షకు గుంటూరు నుంచి హాజరయ్యే అభ్యర్థులకు అన్-రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్‌ను నడపనున్నారు. ఈ మేరకు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ RRB స్పెషల్ ట్రైన్(07171) ఈ నెల 24, 25, 26, 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలకు బయలుదేరి మంగళగిరి, విజయవాడ మార్గంలో ప్రయాణించి సాయంత్రం 4.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.
News November 22, 2024
నేడు దేవకీనంద వాసుదేవ చిత్రం విడుదల సంబరాలు: GNT
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా నటించిన 2వ చిత్రం ‘దేవకీనంద వాసుదేవ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొరిటెపాడులోని హరిహర మహాల్ వద్ద ఉదయం 11.30 ని.లకు గల్లా అభిమానులు కేక్ కటింగ్ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులు, అభిమానులు హాల్ వద్దకు భారీగా తరలి రావాలని గల్లా అశోక్ అభిమానులు పిలుపునిచ్చారు.