News October 4, 2025
హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద తగ్గిన వరద ఉద్ధృతి

హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజ్‌లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 75 వేల క్యూసెక్కులకు ఉన్న వరద నీరు శనివారం ఉదయం 6 గంటలకు 50 వేల క్యూసెక్కులకు చేరుకుందని డీఈ సరస్వతి తెలిపారు. 2, 3వ ప్రమాద సూచికలు తొలగించామని, ఒకటవ ప్రమాద సూచిక కొనసాగుతుందని ఆమె వివరించారు.
Similar News
News October 4, 2025
శ్రీకాకుళం జిల్లాలో 13,887 మందికి రూ.15 వేల సాయం

ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున నగదును వారి అకౌంట్లలో నేడు జమ చేయనుంది. ఈ వాహన మిత్ర పథకానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 15,341 మంది ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,887 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొత్తం రూ.21 కోట్ల మేర ప్రభుత్వం నిధులను మంజూరు చేయనుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ నేడు నగదును జమ సీఎం చంద్రబాబు చేయనున్నారు.
News October 4, 2025
SKLM: ‘27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి’

వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 350 విద్యుత్ మీటర్ల వైర్లు తెగిపడ్డాయని, 5 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయని చెప్పారు. సుమారు రూ.20 లక్షలతో పునరుద్ధరణ పనులు చేశామన్నారు. 600 మంది సిబ్బందిని 300 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని వినియోగించామన్నారు.
News October 4, 2025
విజయనగరంలో పైడిమాంబ ఇలా వెలిశారంట..!

విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో <<17901456>>పైడిమాంబ<<>> అన్న విజయరామరాజు యుద్ధానికి వెళ్తుండగా వద్దని అమ్మ వారించారు. పంతం మీద యుద్ధానికి వెళ్లిన అన్న మృతి వార్త విని పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేశారు. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తికి కలలో కనిపించి చెరువులో ప్రతిమగా వెలిసినట్లు చెప్పగా ఆయన వెలికి తీయించారు. అదే ఇప్పుడు వనం గుడిగా మారింది.