News August 27, 2024

హిరమండలం: వంశధార కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

హిరమండలం మైత్రీ కాలనీకి చెందిన జోగి దుర్గాప్రసాద్ అనే యువకుడు వంశధార కుడి ప్రధాన కాలువలో దూకిగా సంఘటనలో మంగళవారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్సై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్‌ను తల్లి సావిత్రమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు సోమవారం కాలువలో దూకాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.

Similar News

News September 18, 2025

SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం, 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

News September 18, 2025

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

image

హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నిర్మించారని అదనపు ఎస్పీ కె.వి.రమణ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకులు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేశారు. ఆయుధాలతో పాటు పనిముట్లు ప్రాముఖ్యతను తెలిపిన గొప్ప వ్యక్తి విశ్వకర్మ అని ఆయన పేర్కొన్నారు.

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు