News April 4, 2025
హీటెక్కిన రాప్తాడు రాజకీయం!

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.
Similar News
News April 5, 2025
నారాయణపేట: ‘రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దు’

పేద ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని రెండు పార్టీలను ప్రజలు నమ్మకూడదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నారాయణపేట అంబేడ్కర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఏడాదికి రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
News April 5, 2025
కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

గ్రామ పాలన అధికారుల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తులను ఏప్రిల్ 16లోపు కలెక్టరేట్‌లో అందజేయాలన్నారు.
News April 5, 2025
బాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

AP: సీఎం చంద్రబాబుతో కలిసి PCC చీఫ్ షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. జగన్‌ను దెబ్బ తీయడానికే షర్మిలతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుంది. హోదా తీసుకురాలేదు. పోలవరాన్ని సర్వనాశనం చేశారు. లోకేశ్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే కేంద్రంతో లాలూచీ పడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.