News April 4, 2025

హీటెక్కిన రాప్తాడు రాజకీయం!

image

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.

Similar News

News February 22, 2026

కంబదూరు మండలంలో విషాదం

image

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 19, 2026

మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

image

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.

News February 19, 2026

‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.