News December 1, 2025

హీట్ పెంచుతున్న ‘హిల్ట్’!

image

TG: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT) పాలసీ రాజకీయంగా హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని GOVT చెబుతోంది. అయితే భూమిని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని, ₹5L Cr స్కామ్‌ జరుగుతోందని BRS, BJP <<18438533>>విమర్శిస్తున్నాయి<<>>. తాజాగా గవర్నర్‌కు కంప్లైంట్ చేరింది. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో?

Similar News

News April 14, 2026

సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: పొన్నం

image

TG: RTC ఉద్యోగులు <<19641755>>సమ్మె నిర్ణయాన్ని<<>> వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

News April 14, 2026

ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.

News April 14, 2026

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.