News February 15, 2025

హీరో నితిన్‌కు ఎమ్మెల్యే బొజ్జల ఆహ్వానం

image

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు నితిన్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారిక ఆహ్వానం అందించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రత్యేక ఉత్సవాల్లో సినీ హీరో నితిన్ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.

Similar News

News February 20, 2026

TU: M.Ed పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి నిజామాబాద్లో విద్యనభ్యసిస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News February 20, 2026

ఏకసభ్య కమిషన్ ఛైర్మ‌న్‌గా చంద్రబాబే ఉండాల్సింది.. భూమన ఎద్దేవా

image

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో <<19193937>>ఏకసభ్య కమిషన్<<>> నియామకాన్ని YCP నేత భూమన తప్పుబట్టారు. CBN కోరుకున్నట్లు CBI విచారణ జరగలేదన్నారు. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమే అని చెప్పారు. CBI సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఛైర్మ‌న్‌గా చంద్రబాబే ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు.

News February 20, 2026

VZM: ‘ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలి’

image

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ సామాజిక న్యాయం ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో అసమానతలను తొలగించి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 వినియోగించుకోవాలని సూచించారు.