News October 8, 2025
హుజూరాబాద్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువలో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృత దేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, రెండు రోజుల క్రితం కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. శవం ఉబ్బిపోవడంతో గుర్తింపు కష్టతరమైందని పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణం, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 8, 2025
HYD: వాటర్ ట్యాంకర్లు ‘మాయం’.. చేయలేరిక

నీటి ట్యాంకర్ల దారి మళ్లింపులు, అక్రమ బిల్లింగ్‌లపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు HMWSSB ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం (AVTS) తీసుకొచ్చింది. యాప్‌లో లైవ్ ట్రాకింగ్‌తో ట్యాంకర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ట్రిప్, బిల్లు డిజిటల్‌గా రికార్డ్ అవ్వడంతో అక్రమాలకు తావుండదు. వాహనం ఆలస్యమైనా అధికారులకు అలర్ట్‌లు వెళ్తాయి. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన సేవలు అందుతాయి.
News October 8, 2025
మాకవరపాలెం: జగన్ పర్యటన.. భద్రతపై ఎస్పీ సమీక్ష

మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంతాన్ని ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు. రేపు జరగనున్న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంభందించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే ప్రదేశంతో పాటు కళశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
News October 8, 2025
అనకాపల్లి: ‘PGRS అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి’

మండల, డివిజన్ స్థాయిలో పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలన్నారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి సమన్వయ కమిటీ ద్వారా సివిల్ తగాదాలను పరిష్కరించాలని సూచించారు. నీటితీరువా, కోర్టు కేసులు, స్మార్ట్ కార్డుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు.