News April 12, 2024
హుజూరాబాద్: పెరిగిన బస్సు ఛార్జీలు!

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News September 10, 2025
KNR: ‘దివ్యాంగులు జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోండి’

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మనోహర స్వామి తెలిపారు. టెన్త్ సర్టిఫికేట్ ఆధారంగా www.pwdjob.portal.telangana.gov.in వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ పోర్టల్ ద్వారా 300కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
News September 10, 2025
KNR: TGCPGET ఫలితాల్లో SRR జంతు శాస్త్ర విద్యార్థుల రాష్ట్రస్థాయి ర్యాంకులు

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగంలో విద్యార్థి ఏ.శివప్రసాద్ రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారు. దీనితో పాటుగా ఎన్.ఆదిత్య 40వ ర్యాంకు, సీహెచ్. శివాజీ 70వ ర్యాంకు, జె.సంహిత 100 ర్యాంకు, కే.సాయితేజ 107, అనేక మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె.కిరణ్మయి విద్యార్థులను సన్మానించారు.
News September 10, 2025
KNR: RTC పంచారామాలు టూర్ ప్యాకేజీ వివరాలు

KNR- 2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో పంచారామాలు అనగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోట దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఈనెల 12న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 15న బస్సు KNR చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.3,300/-, పిల్లలకు రూ.2,500/- టికెట్ నిర్ణయించామన్నారు. వివరాలకు CALL 9398658062.