News April 1, 2024
హుజూరాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక.. వివాహిత సూసైడ్

భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. KNRకి చెందిన మౌనికరెడ్డిని, హుజూరాబాద్‌కి చెందిన రాకేశ్‌రెడ్డితో 2016లో పెళ్లైంది. రాకేశ్కెడ్డి తండ్రి తన ఆస్తిలో కొంతస్థలాన్ని మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఇద్దరికి గొడవలు జరుతున్నాయి. ఆదివారం మౌనిక తండ్రికి ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, తెలిపి ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News September 8, 2025
MOUలతో విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కొత్తపల్లి(H) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు “ట్రస్మా” అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు జేఈఈ, ఐఐటీ, నీట్ కోర్సు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో MOUలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు అందిస్తామన్నారు.
News September 8, 2025
KNR: నేడు రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ సమావేశం

కరీంనగర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రాజకీయ పార్టీలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుపై సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
News September 7, 2025
కరీంనగర్లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.