News October 10, 2025

హుజూరాబాద్: రెస్టారెంట్ సిబ్బందిపై దాడి..!

image

హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న నిర్వాణ రెస్టారెంట్ సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనంతరం కొందరు వ్యక్తులు సిబ్బందిపై చేయిచేసుకున్నారు. గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేయడానికి గాల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News October 10, 2025

సమాచార హక్కు చట్టం వారోత్సవంలో KRM జిల్లాకు అవార్డు

image

కరీంనగర్ జిల్లాకు అవార్డు దక్కింది. సమాచార హక్కు చట్టం వారోత్సవంలో భాగంగా రాష్ట్ర సమాచార కమిషన్ నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అవార్డును స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.

News October 9, 2025

KNR: ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలి: కలెక్టర్

image

MPTC, ZPTC ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడుతుండడం, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం VC నిర్వహించారు. నామినేషన్ల దాఖలుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీల్ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన వంటి ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలన్నారు.

News October 9, 2025

HZB రెవెన్యూ డివిజన్‌లో మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలు

image

హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శంకరపట్నం 13, వీణవంక 14, ఇల్లందకుంట 9, జమ్మికుంట 10, HZB 12, సైదాపూర్(V) 12 మొత్తం 70 MPTC స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 12న పరిశీలన. 15న ఉపసంహరణ. 23న ఎన్నికలు. నవంబర్ 11న కౌంటింగ్ ఉంటుంది.