News March 16, 2025
హుజూర్‌నగర్‌లో నలుగురు నకిలీ ఎస్ఐలు అరెస్ట్

నలుగురు యువకులు గోల్డ్ షాప్ యజమానిని బెదిరించిన ఘటన HNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. NLG జిల్లా నిడమనూరుకు చెందిన ప్రశాంత్, అక్షిత్, NLGకు చెందిన ఇరాన్, వాజిద్ APలోని కుప్పం SI డీపీని పెట్టుకున్నారు. HNRలో గోల్డ్ షాపు యజమానికి కాల్ చేసి నువ్వు దొంగల నుంచి గోల్డ్ కొన్నావు, జైలుకు పంపుతామని బెదిరించగా అతను భయపడి రూ.10 వేలు పంపాడు. అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
Similar News
News March 16, 2025
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారు: సీఎం రేవంత్

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పును తమపై పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ పాత్ర మరువలేనిదని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయశంకర్ సర్ వంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులని అన్నారు.
News March 16, 2025
BRS రంగుల ప్రపంచాన్ని మాత్రమే చూపించింది: సీతక్క

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అన్నారు. గత 10 సంవత్సరాలలో కేవలం రంగుల ప్రపంచాన్ని మాత్రమే BRS చూపించింది.. కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజా పాలనలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే మహిళలను అణగ తొక్కడం అని ఆరోపించారు.
News March 16, 2025
ఓయూలో ఏకమవుతున్న విద్యార్థి సంఘాలు !

ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నాయి. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.