News January 8, 2026

హుజూర్‌నగర్: నేటి నుంచే ‘సింగిల్ బెడ్‌రూమ్’ దరఖాస్తుల స్వీకరణ

image

స్థానిక రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులు ఈ నెల 20వ తేదీ వరకు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

Similar News

News February 20, 2026

ఖమ్మం: ఎస్సీ స్టడీ సర్కిల్ దరఖాస్తులకు 22 చివరి తేదీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగులకు అందించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఈ నెల 22న ముగియనుందని డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణ కోసం మార్చి 1న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు

image

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్ నుంచి రాజ్‌కోట్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 09576 గల ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల 3న మహబూబ్‌నగర్‌లో బయలుదేరి జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ స్టేషన్ల మీదుగా రాజ్‌కోట్‌కు చేరుకుంటుందని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, అదనపు రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.