News August 14, 2025
హుజూర్‌నగర్ విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షలలో హుజూర్‌నగర్‌కి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అర్హత పరీక్షలలో జిల్లా నుంచి తొలి దశలోనే ఎంపిక అయ్యారు. కోలపూడి శ్రీమాన్, పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్‌లు రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.
Similar News
News August 16, 2025
GNT: మార్ఫింగ్ ఫొటోల బెదిరింపులు.. యువకుడిపై కేసు నమోదు

ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన యువకుడిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. సుందర్ అనే యువకుడు మల్లిఖార్జునపేటకు చెందిన ఇంటర్ విద్యార్థినితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేకుంటే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
News August 16, 2025
NRPT: 20న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

NRPTలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో పాల్గొనేందుకు ఈనెల 20న బాల,బాలికలకు అండర్-14, 16,18,20 ఎంపికలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ Way2Newsతో తెలిపారు. U-14(15-10-2011/14-10-2023), U-16(15-10-2009/14-10-2011), U-18(15-10-2007/14-10-2009), U-20(15-10-2005/14-10-2007) మధ్య జన్మించి ఉండాలని, పూర్తి వివరాలకు 91007 53683,90593 25183 సంప్రదించాలన్నారు.
News August 16, 2025
బాపట్ల యువకుడికి టాప్ ర్యాంక్.. సబ్ DFO పోస్ట్

బాపట్లలోని పాండురంగ పేటకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ 2023లో విడుదలైన IFS ఫలితాల్లో టాప్-1 ర్యాంక్ సాధించారు. శిక్షణ పూర్తి కావడంతో ఏపీ కేడర్ కింద ఆయనకు పోస్టింగ్ కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ DFOగా వెంకట శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.