News February 23, 2025
హుస్నాబాద్: తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ ఉదంతం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో శనివారం జరిగింది. వ్యవసాయంలో నష్టం రావడంతో బోనాల శ్రీనివాస్ (46) అనే రైతు పురుగు మందు సేవించి శుక్రవారం ఆత్మహత్యయత్నం చేయగా, హనుమకొండలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీనివాస్‌కు ఇరువురు కుమార్తెలు ఉండడంతో అందులో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టింది.
Similar News
News February 23, 2025
విషాదం: లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని..

AP: తిరుపతి(D) చంద్రగిరిలో విషాదకర ఘటన జరిగింది. లారీ, పాల ట్యాంకర్ మధ్య ఇరుక్కుని గంటలపాటు నరకయాతన అనుభవించిన ఓ డ్రైవర్ మరణించాడు. మారేడుపల్లికి చెందిన సుందరరాజన్ ఓ పని కోసం లారీతో శనివారం అర్ధరాత్రి హెరిటేజ్ ఫ్యాక్టరీకి వచ్చాడు. తర్వాత టైర్లలోని రాళ్లను తొలగిస్తుండగా ట్యాంకర్ హ్యాండ్ బ్రేక్ ఫెయిలై దూసుకొచ్చింది. తప్పించుకునే లోపే రెండింటి మధ్య ఇరుక్కుని చనిపోయాడు. ఉదయం వరకు ఎవరూ గుర్తించలేదు.
News February 23, 2025
మెదక్: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 23, 2025
మరికాసేపట్లో తిరుపతికి రానున్న CM

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో రేణిగుంటకు రానున్నారు. 10.55 నిమిషాలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11:10కి తుకివాకంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ కుమారుని వివాహానికి హాజరవుతారు. అనంతరం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.