News December 27, 2025

హుస్నాబాద్: పుత్ర శోకం తట్టుకోలేక తండ్రి మృతి

image

వారం రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో హుస్నాబాద్‌ మం. గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రావు(53) ఈనెల 20న గుండెపోటుతో మరణించారు. చేతికందిన కొడుకు దూరం కావడాన్ని తండ్రి చొక్కారావు(85) తట్టుకోలేకపోయారు. కొడుకు అంత్యక్రియల రోజే స్పృహతప్పి పడిపోయిన ఆయన, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.

Similar News

News December 29, 2025

నేడు ప్రజా సమస్య పరిష్కార వేదిక: కలెక్టర్

image

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 29, 2025

పెన్షన్ పంపిణీ తేదీ మార్పు

image

జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్లను డిసెంబర్ 31న ఇంటివద్దకే వెళ్లి పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పెన్షన్ పంపిణీ సజావుగా జరిగేలా కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. పెన్షన్ పంపిణీలో ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 29, 2025

రేపే వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం

image

ధనుర్మాసం ఎంతో శక్తిమంతమైనది. వైకుంఠ ఏకాదశి నాడు ఈ వైభవం రెట్టింపవుతుంది. ఈ పవిత్ర దినాన భక్తులు చేసే ఉపవాసం శారీరక, మానసిక శుద్ధిని ఇస్తుంది. రాత్రంతా హరినామ స్మరణతో చేసే జాగరణ అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తెల్లవారుజామునే పురుషోత్తముణ్ని దర్శించుకోవడం వల్ల జన్మ ధన్యమవుతుంది. భక్తిశ్రద్ధలతో విష్ణువును ఆరాధించే వారికి సకల పాపాలు తొలగి, చివరకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.