News July 10, 2025
హుస్నాబాద్: బాత్‌రూంలో పడి గీతకార్మికుడు మృతి

అక్కన్నపేటకు చెందిన మాటూరి సదానందం బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఎస్సై చాతరాజు ప్రశాంత్ వివరాలు.. గతనెల 19న తాటిచెట్టుపై నుంచి కాలుజారి పడిపోయిన సదానందం, WGLలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఈనెల 5న ఇంటికి వచ్చారు. బుధవారం ఇంట్లోని బాత్‌రూంలో కాలుజారి మళ్ళీ కిందపడ్డాడు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News July 10, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులను యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి’

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను డిఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయాలనీ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఐఎస్, సిఆర్పీ, సిఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు. డిఈఓ మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం లోపల రిజిస్ట్రేసన్ పూర్తి చేయాలని తెలిపారు. పూర్తి చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని సూచించారు.
News July 10, 2025
ఉప్పొంగిన ప్రాణహిత.. నీట మునిగిన పంటలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని నాగ పల్లి, సోమిని, కోయపల్లి, తలాయి, తిక్కపల్లి గ్రామాల సమీపంలోకి ప్రాణహిత వరద ప్రవాహం చేరింది. భారీగా ప్రాణహిత వరద ప్రవాహంతో పంటలన్నీ నీట మునిగాయి. ప్రతి ఏటా ప్రాణహిత వరద ప్రవాహంతో పంటలు నీట మునిగి నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News July 10, 2025
గద్వాల: నిందితులకు మరో 14 రోజుల రిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో ప్రధాన నిందితులను గురువారం గద్వాల న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ ముగియగా, న్యాయస్థానం మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో A-1 తిరుమలరావు, A-3 నగేష్, A-4 పరుశరాము, A-5 రాజులను పోలీసులు 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు మిస్టరీపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముంది.