News March 7, 2025
హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్‌టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
Similar News
News March 9, 2025
NLG: ఇంకా ప్రారంభం కానీ రేషన్ పంపిణీ!

నల్గొండ జిల్లాలో చాలాచోట్ల రేషన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. కనీసం సగానికిపైగా రేషన్ దుకాణాలకు బియ్యం కోటా అందలేదు. దీంతో లబ్ధిదారులకు ప్రతినెలా 1వ తేదీ నుంచి మొదలు కావాల్సిన బియ్యం పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లబ్ధిదారులు దుకాణాల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో పూర్తిస్థాయి రేషన్ పంపిణీకి మరో వారం నుంచి పది రోజులకు పైగానే పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
News March 9, 2025
చింతకాని : యువతి అదృశ్యం… కేసు నమోదు

చింతకానికి చెందిన ఓ యువతి ఈ నెల7 నుంచి కానరాకుండా పోవడంతో అమెతండ్రి ఫిర్యాదు మేరకుపోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు కోదాడకు చెందిన ఓ యువకుడితో గత నెల 24 నిశ్చితార్థం జరిగింది. పెళ్లికోసం ఇంట్లో దాచిన రూ. 2.50 లక్షలుతీసుకోని వెళ్లిపోగా, ఎక్క డ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.
News March 9, 2025
కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించిన వ్యక్తి హతం

పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించిన ముఫ్తీ షా మిర్‌ను గుర్తుతెలియని దుండగులు బలూచిస్థాన్‌లో కాల్చి చంపారు. 2016లో కుల్‌భూషణ్‌ను ఇరాన్-పాకిస్థాన్ బార్డర్‌లో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. జాదవ్‌ను కిడ్నాప్ చేసిన బృందంలో సభ్యుడు, జైష్-అల్-అదిల్ నేత ముల్లా ఒమర్ ఇరానీ సైతం 2020లో హతమవ్వడం గమనార్హం.