News March 21, 2024
హుస్నాబాద్: యువకుడి సూసైడ్
హుస్నాబాద్‌కి చెందిన రుద్రయ్య(20) కరీంనగర్ జిల్లాలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో ఓ యువతిని గత నెల 2న పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రుద్రయ్య ఇంటికి వెళ్లి మేజర్ అయ్యే వరకు దూరంగా ఉండాలంటూ యువతిని తీసుకువెళ్లారు. అనంతరం ఫొటోలను డిలీట్ చేయాలంటూ బెదిరించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 25, 2024
దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి
కొండపాక వాస్తవ్యులు దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. 1983-88లో అప్పటి దొమ్మాట ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో ప్రజా సేవలో ఉన్న ఆయన సేవలు నేటితరం వారికి స్ఫూర్తి అని కొనియాడారు.
News November 25, 2024
మెదక్: నేడు ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 24, 2024
మెదక్: కాంగ్రెస్ హామీలు.. నీటి మీద రాతలు: హరీష్ రావు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పర్యటించారు. స్వాగతం పలికిన మహిళలతో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న రూ.2500, తులం బంగారం అందుతున్నాయా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మీద రాతలన్నారు.