News November 19, 2024
హెచర్చరికలు జారీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్
ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంవర్థకం, అక్వా రంగాల క్షేత్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2024
శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం
శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.
News November 21, 2024
చంద్రబాబును జైలులో సీసీ కెమెరాలు పెట్టి చూశారు: MLA బొలిశెట్టి
అసెంబ్లీలో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నేతలపై అక్రమ కేసుల పెట్టిన వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టిన సమయంలో జైలులో సీసీ కెమెరాలు అమర్చి, వైసీపీకి చెందిన కీలక నేత ఆ వీడియోలు తన ఫోనులో చూసుకొనే విధంగా ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. కారకులను శిక్షించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు.
News November 21, 2024
ప.గో జిల్లాలో దొంగతనాలు..అరెస్ట్ చేస్తారని సూసైడ్
అరెస్ట్ భయంతో తిరుపతిలో సూర్యప్రభాశ్(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇతను ప.గో, ఏలూరులో దొంగతనాలు చేసి కేసులు నమోదవ్వగా తిరుపతికి పారిపోయాడు. లక్కవరం ఎస్సై రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్సై సంపత్ కుమార్ సిబ్బందితో తిరుపతికి వెళ్లారు. పోలీసులను గమనించి అతను గడియ పెట్టుకొని..అరెస్ట్ చేస్తారనే భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు.