News July 13, 2024
హెచ్ఎండీఏకు త్వరలో కొత్త సిబ్బంది

హెచ్ఎండీఏకు జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చురుకుగా పనిచేసే కొందరు పీవోలు, ఏపీవోలు, జేపీవోలు, మిగతా సిబ్బందిని గుర్తించి వారికి హెచ్ఎండీఏలోని వివిధ జోన్లలో బాధ్యతలు కేటాయించనుంది. త్వరలో చేపట్టనున్న బదిలీల్లో ఈ నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News February 19, 2026
వికారాబాద్ కొండలపై ఏపీ DCCలకు ట్రైనింగ్

హైదరాబాద్ శివారు ప్రాంతమైన అనంతగిరి గుట్టపై ఏపీకి చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ టి.కాంగ్రెస్‌కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతోపాటు ఏపీ డీసీసీ అధ్యక్షుడు ఈ నెల 21 నుంచి జరిగే శిక్షణలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మంది ఈ ట్రైనింగుకు హాజరవుతారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు రాహుల్ గాంధీ వచ్చే అవకాశముంది.
News February 19, 2026
ముంబైలో HYD ఫ్యూచర్ ప్లాన్ చెప్పేసిన రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో HYD ఎలా ఉండబోతోందో ముంబైలో చెప్పేశారు. ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను అక్కడ జరిగిన క్లైమేట్ వీక్ సదస్సులో వెల్లడించారు. తొమ్మిదేళ్లలో సిటీని నెట్ జీరో సిటీగా మార్చడం, విద్యుత్ వినియోగం 34 వేల మెగావాట్లకు పెంచడం, 2 లక్షల ఆటోలను రెట్రోఫిట్ చేయడం, 3,500 ఆర్టీసీ బస్సులను ఈవీ బస్సులుగా మార్చడం.. మెట్రో రైల్ విస్తరణను 200 కి.మీ.కు విస్తరించడం లాంటి ప్లాన్స్‌ను వివరించారు.
News February 19, 2026
HYDలో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్..!

FEB 20,21,22 తేదీల్లో 3రోజులు HYDలో అగ్రి షో పేరుతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. NTR స్టేడియంలో ఈ ప్రోగ్రాం ఉంటుందని.. 3రోజుల్లో లక్షమంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దేశ, విదేశాల నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కుపైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. www.rbagrishow.com.


