News March 2, 2026

హెజ్బొల్లా పార్లమెంటరీ చీఫ్ హతం!

image

ఇరాన్, దాని మద్దతు గ్రూపులకు ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఖమేనీని హతమార్చిన ఆ దేశం తాజాగా హెజ్బొల్లాను టార్గెట్ చేసింది. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి అడుగుపెట్టిన మిలిటెంట్ గ్రూప్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. లెబనాన్‌లోని స్థావరాలపై చేసిన దాడిలో హెజ్బొల్లా పార్లమెంటరీ చీఫ్ మహమ్మద్ రాద్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. భారీ మూల్యం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

Similar News

News March 2, 2026

పాక్ చెత్త ఆట.. ఒక్కో క్రికెటర్‌పై 50 లక్షల ఫైన్!

image

T20 WC సెమీస్ చేరడంలో ఫెయిల్ అయిన పాక్ ప్లేయర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు సీరియస్ అయ్యింది. ఒక్కొక్కరికీ 50 లక్షల పాకిస్థానీ రూపాయల (సుమారు ₹16 లక్షలు) ఫైన్ వేసినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండియా చేతిలో ఓడినప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. S-8లో ఇంగ్లండ్ చేతిలో ఓడటం, తర్వాత శ్రీలంకపై గెలిచినా రన్ రేట్ సరిపోకపోవడంతో పాక్ టోర్నీ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

News March 2, 2026

TTDలో 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

తిరుమల తిరుపతి దేవస్థానం(<>TTD<<>>)30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBS, MS/DNB, MD, PG డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి16 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2.92L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.2.73L, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.2.09L, మెడికల్ ఆఫీసర్‌కు రూ.93,525, Jr. రెసిడెంట్‌కు రూ.74,750, Sr. రెసిడెంట్‌కు రూ.80,500 చెల్లిస్తారు. సైట్: www.tirumala.org

News March 2, 2026

మ్యాగ్జిమం కిక్ కోసం కాఫీ ఎప్పుడు తాగాలంటే..

image

చాలామంది నిద్రలేవగానే బెడ్ కాఫీతో రోజును స్టార్ట్ చేస్తారు. కానీ కొన్ని స్టడీస్ ప్రకారం దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. మార్నింగ్ లేచిన ఒక గంట తర్వాత కాఫీ తాగితేనే ఎనర్జీ బూస్ట్ అవుతుందట. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య వచ్చే డల్‌నెస్‌ను పోగొట్టడానికి కాఫీ బెస్ట్ ఆప్షన్. వర్కౌట్స్‌కి 30-60 నిమిషాల ముందు తీసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు కాఫీకి దూరంగా ఉంటే నిద్ర డిస్టర్బ్ అవ్వదు.