News December 13, 2025
హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్: తిరుపతి SP

తిరుపతి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు మూడు దశల ప్రణాళికను అమల్లోకి తెచ్చామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుందన్నారు. జరిమానాలు కాదని.. ప్రాణ రక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని అందరూ హెల్మెంట్ వాడాలని కోరారు. తిరుపతి జిల్లాలో ఈనెల 15 నుంచి ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.
Similar News
News December 15, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తూ బ్రహ్మే నిర్వహిస్తాడని నమ్మకం. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవాల్లో ముందు నడిచేది బ్రహ్మ రథమే. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. నారాయణుడికి సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు, హనుమంతుడు వంటి దేవతలు, పక్షులు, జంతువులు వాహన సేవ చేస్తాయి. ఇది ప్రకృతిలోని సర్వశక్తులు, సకల జీవులు స్వామివారికి సేవ చేయడాన్ని సూచిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 15, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News December 15, 2025
అమలాపురం: పొట్టి శ్రీరాములుకి ఘన నివాళి

తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నిశాంతి జిల్లా అధికారులు పాల్గొన్నారు.


