News August 20, 2025
హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు, పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Similar News
News August 20, 2025
వనపర్తి: ‘వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి’

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ గిరిధర్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటుకు https://policeportal.tspolice.gov.in/index.htm అనే ఆన్‌లైన్ లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News August 20, 2025
భద్రాద్రి: BRS మహిళా నేత కుటుంబానికి KCR రూ.5 లక్షల సాయం

దమ్మపేట మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, BRS నాయకురాలు తూత నాగమణి దశదిన కర్మలో MLC తాతా మధు, మాజీ MLAలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగమణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం BRS అధినేత KCR, KTRల తరఫున నాగమణి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో నాగమణి చేసిన కృషిని నాయకులు కొనియాడారు.
News August 20, 2025
పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి: కామారెడ్డి కలెక్టర్

డెంగ్యూ, డయేరియా వ్యాధులను నివారించడానికి పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తాడ్వాయి మండలం సంతాయిపేటలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించి, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.