News January 3, 2026

హైకోర్టులో కేసు వేసిన వేదిక్ యూనివర్సిటీ VC

image

TTD శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ రాణి సదాశివమూర్తి హైకోర్టులో ‘WRIT PETITION’ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, TTD, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను అందులో ప్రతివాదులుగా చేర్చారు. VC పదవికి ఆయన అనర్హుడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. TTD బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

Similar News

News January 9, 2026

కామారెడ్డి: చలి తీవ్రం.. జర పదిలం

image

కామారెడ్డి జిల్లా అంతటా చలి విపరీతంగా ఉంది. బయటకు వెళ్లాలంటే చలి తీవ్రతకు, శీతల గాలులకు ప్రజలు వణుకుతున్నారు. జిల్లాలో 12 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్‌లో (10°C లోపు) ఉండగా, 20 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్2లో (15°C లోపు) ఉన్నాయి. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రతలు పాటించాలని, వెచ్చని వస్త్రాలు ధరించకుండా బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రయాణాలు సైతం ఉదయం, రాత్రి వాయిదా వేసుకోవాలని సూచించారు.

News January 9, 2026

గద్వాల్: పంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

image

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ (TPSF) క్యాలెండర్‌ను MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యదర్శులు అంకితభావంతో చేశారని అభినందించారు. ఫెడరేషన్ ప్రతినిధులు MLAను సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. రాధాగోపాల్, ప్రధాన కార్యదర్శి బి.భరత్ నాయుడు ఫెడేరేషన్ సభ్యులు పాల్గొన్నారు.

News January 9, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి

image

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.