News October 3, 2025

హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమ‌తి పున‌రుద్ధ‌ర‌ణ

image

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌న్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎక‌రాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమ‌తిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పున‌రుద్ధ‌రించారు.

Similar News

News October 3, 2025

అలయ్-బలయ్‌: ‘దత్తన్న దసరా దావత్’ అదిరింది!

image

అలయ్-బలయ్‌లో దత్తన్న దావత్ అదిరిపోయింది. 86 రకాల తెలంగాణ వంటకాలు 8 వేల మంది కడుపు నింపాయి. 12 క్వింటాళ్ల బాస్మతి, 4 క్వింటాళ్ల సోనా మసూరి రైస్, 12 క్వింటాళ్ల మటన్, 40 క్వింటాళ్ల చికెన్‌‌తో వెరైటీ డిష్‌‌లు గుమగుమలాడాయి. చేపలు, రొయ్యలు, లివర్, బోటి, తలకాయ, నల్లా, పాయ, హలీమ్‌తో పాటు 20 రకాల వెజ్ ఫ్రై ఐటమ్స్, పచ్చి పులుసు నుంచి సల్ల చారు వరకు మెనూలో ఉన్నాయి. హండిళ్లో చేసిన డబుల్ కా మీఠా నోరూరించింది.

News October 3, 2025

HYD: లాడ్జీలో యువతి స్నానం.. వీడియో తీసిన యువకులు

image

విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి ఓ లాడ్జీలో యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి ఇద్దరు యువకులు వీడియో తీశారు. గమనించిన ఆమె కేకలు వేయడంతో ఆకతాయిలు పారిపోయారు. ఈ విషయమై స్థానిక గవర్నర్‌పేట PSలో ఫిర్యాదు చేయగా యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News October 3, 2025

కేంద్రమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

image

ప్రజలకు మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు.