News January 25, 2025
హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా వాసి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లికి చెందిన జస్టిస్ ఈడ తిరుమలదేవితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు న్యాయమూర్తిగా, తెలంగాణ జ్యడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా జస్టిస్ తిరుమలాదేవి పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పదోన్నతి లభించింది.
Similar News
News February 25, 2026
నిర్మల్: చిత్తడి నేలల రక్షణే లక్ష్యం: కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని చిత్తడి నేలలను శాస్త్రీయంగా గుర్తించి, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని సూచించారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
News February 25, 2026
PDPL: మందు బాబులకు జైలు శిక్ష, భారీ జరిమానాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడిపిన మందు బాబులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి మంజుల బుధవారం తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ CI అనిల్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి రెండోసారి పట్టుబడిన దుర్గం నరేందర్ కు ఒకరోజు, గుండేటి సాగర్ కు 4 రోజులు, గడ్డం మల్లయ్యకు 5 రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే 27 మందికి ₹ 34,800 జరిమానా విధించినట్లు CI పేర్కొన్నారు.
News February 25, 2026
వేధింపుల కేసులో కృష్ణాజిల్లా కానిస్టేబుల్‌కి రిమాండ్

కృష్ణాజిల్లా APSRTCలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేకల నరేంద్రను మంగళవారం నాదెండ్ల పోలీసులు అరెస్టు చేశారు. మండలానికి చెందిన ఓ యువతిని ఆయన వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడడంతో కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్రను బుధవారం చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.


