News November 11, 2024
హైడ్రా కమిషనర్ ఇంట సకుటుంబ సర్వే

గ్రేటర్ హైదరాబాద్‌లో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో మధురానగర్‌లో ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి సర్వే నమోదు కోసం అధికారులు వెళ్లారు. ఒక్కోఇంటి వద్ద అరగంట సమయం పడుతుందని డాటాను ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. చార్మినార్, సికింద్రాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీత్సవ కోట, కూకట్పల్లి, శేరిలిగంపల్లి వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News November 10, 2025
జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT
News November 10, 2025
జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.
News November 10, 2025
కోకాపేట్, మూసాపేట్లో భూముల వేలం!

కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాల్లోని 9 ఖాళీ ప్లాట్ల ఈ-వేలం కోసం HMDA సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నవంబర్ 17 ఉదయం 11:00 గంటలకు T-Hub వేదికగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలిస్ (6), గోల్డెన్ మైల్ (1), మూసాపేట్లో (2) ప్లాట్లు వేలం వేయనున్నారు. ఆసక్తిగల డెవలపర్లు పాల్గొనవచ్చని HMDA పిలుపునిచ్చింది. మరింత సమాచారం కోసం www.hmda.gov.inను సంప్రదించండి.
SHARE IT


