News September 24, 2025
హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువులను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు కబ్జాలకు గురి కావడంతో వరద నేరుగా చెరువుకు వెళ్లకుండా కాలనీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
Similar News
News September 24, 2025
ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్‌ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్‌తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 24, 2025
HYD నుంచి బందర్ పోర్టు వెళ్లేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే

హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి త్వరగా రూట్ మ్యాప్ ఖరారు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.
News September 24, 2025
కొడంగల్: రోడ్డు వేసిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయింది: కేటీఆర్

కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొత్తగా వేసిన రోడ్డు ఒక్క భారీ వర్షంతో కొట్టుకుపోయింది. బొంరాస్‌పేట మండలం బాపల్లి నుంచి దౌల్తాబాద్ మండలం నందారం వరకు 13 కి.మీకి రూ.30 కోట్లు కేటాయించి నిర్మించిన రోడ్డు దెబ్బతింది. మంచి రోడ్డు కూడా నిర్మించలేని ప్రభుత్వం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టుల్లో చిన్న లోపాన్ని ప్రశ్నించడం విడ్డూరమని తన X ఖాతాలో KTR ఆరోపించారు.