News September 23, 2025

హైడ్రా యాక్షన్.. ఎలా అయిందో చూడండి.!

image

గాజులరామారంలో హైడ్రా యాక్షన్‌పై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రూ.15 కోట్ల విలువైన 317 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు తెలిపింది. వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడికి నేల కనిపిస్తోందని చెప్పారు.

Similar News

News September 23, 2025

KNR: ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల విదేశీ స్కాలర్‌షిప్

image

విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 19లోగా www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నగైలేశ్వర్ తెలిపారు.

News September 23, 2025

మహబూబ్‌నగర్: రేపు ఆర్చరి జట్ల ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ ఆర్చరి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటి PD డా.వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. ఈనెల 24న MBNRలోని స్టేడియం గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు ఆర్చరి (స్త్రీ, పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోపు ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్‌పై ప్రిన్సిపల్/PD సంతకం ఉండాలన్నారు. SHARE IT

News September 23, 2025

HYD: పిజ్జా ఔట్‌లెట్లపై అధికారుల దాడులు

image

రాష్ట్రవ్యాప్తంగా 55 పిజ్జా ఔట్‌లెట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 18 పిజ్జాహట్, 16 డొమినోస్, 21 ఇతర కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్రత, వెజ్, నాన్‌వెజ్ వస్తువులను ఒకేచోట నిల్వ ఉంచడం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.