News April 23, 2025
హైడ్రా లోగో మార్చిన అధికారులు

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) లోగో మారింది. గ్రాన్డియర్ లుక్లో పాత లోగో ఉండగా.. వాటర్ వర్క్స్ విభాగాన్ని తలపించేలా కొత్త లోగో రూపొందించారు. ప్రస్తుతం ఈ కొత్త లోగోనే హైడ్రా తన అధికారిక X అకౌంట్ హ్యాండిల్‌కు DPగా ఉపయోగించింది.
Similar News
News April 23, 2025
కొమరాడ పిహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మంచి వాతావరణం ఉండాలని, వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్యులు అరుణ్ ఉన్నారు.
News April 23, 2025
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించుటకు అధికారులకు బుధవారం జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
News April 23, 2025
అల్లూరి: కౌలు రైతు కుమారుడు జిల్లా ఫస్ట్

అడ్డతీగల గురుకుల పాఠశాలలో టెన్త్ చదివిన వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి 576 మార్కులు సాధించాడు. దీంతో అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో (గురుకులం) మొదటి స్థానం కైవసం చేసుకున్నాడని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రుక్మాంగద తెలిపారు. రాజవొమ్మంగి మండలం కొత్తపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ పేరెంట్స్ చిన్నబ్బాయి, సుజాత వ్యవసాయ కూలీపని చేసి ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు.