News August 31, 2024

‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’

image

పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 22, 2025

HYD: విలీనం.. జనంపై రూ.800 కోట్ల భారం!

image

ULBs విలీనంతో అభివృద్ధి సంగతేమోగానీ, పన్నుల వసూళ్లే లక్ష్యంగా కనిపిస్తోంది. 27 మున్సిపాలిటీల పరిధిలోని 8 లక్షల ప్రాపర్టీస్ గ్రేటర్ పరిధిలోకి తెచ్చారు. రూ.800 కోట్ల అదనపు పన్ను వసూలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.3,100 కోట్లకు పన్ను వసూళ్లు చేరనున్నాయని అధికారులు Way2Newsకు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ పన్నుల వసూలును పూర్తి చేయాలని వేగంగా పావులు కదుపుతున్నారు.

News December 22, 2025

HYDలో పెరుగుతున్న కేసులు.. జర భద్రం!

image

వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. DEC నెలలోనూ డెంగ్యూ కేసులు పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10రోజుల్లో నగరంలో 4పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క NOVలోనే 90కిపైగా డెంగ్యూ, వైరల్‌ జ్వరాల కేసులు ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు. దోమల నివారణకు అధికారుల చర్యలేవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News December 22, 2025

HYD: 10th విద్యార్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్

image

10th విద్యార్థలకు ఇదే లాస్ట్ ఛాన్స్.. నామినల్ రోల్స్‌లో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలని నాంపల్లిలోని SSC బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశముందని బోర్డు డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులూ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులే ఇందుకు బాధ్యత వహించాలని ఆదేశించారు.