News March 2, 2025
హైదరాబాదులో లింగాలగట్టు యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాదు నగరంలో జరిగింది. శ్రీశైల మండలం లింగాలగట్టుకు చెందిన నూకరాజు(27) బీటెక్ పూర్తి చేశాడు. అమీర్పేటలోని ఇంటీరియర్ లాడ్జిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి లాడ్జి గదిలోనే ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని లింగాల గట్టుకు తరలించారు.
Similar News
News February 20, 2026
పెద్దపల్లిలో 24న జాబ్ మేళా.. 51 ఉద్యోగావకాశాలు

PDPL జిల్లా ఉపాధి కార్యాలయంలో FEB 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. సాక్సెస్ ప్రాజెక్టు ఎల్‌ఎల్‌పి సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 50, మార్కెటింగ్ మేనేజర్ 1 పోస్టు ఖాళీగా ఉంది. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఎంబీఏ అర్హతలతో 18-36 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. నూతన కలెక్టర్ భవనం, రూమ్ నం.233లో సర్టిఫికేట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
News February 20, 2026
ఏలూరు కార్పొరేషన్‌పై పట్టుకు ప్రయత్నాలు

కూటమి నేతలు, వైసీపీ నాయకులు ఏలూరు <<19193902>>కార్పొరేషన్<<>> చేజక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కూటమి కోటాలో జనసేన టికెట్ రెడ్డి అప్పలనాయుడు వదులుకోగా, తన అభ్యర్థిని దింపి పగ్గాలు పట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. మరోవైపు ఏలూరులో కీలకమైన కార్పొరేషన్లోనూ తమ అభ్యర్ధిని బరిలోకి దింపి పట్టుకోసం MLA చంటి వర్గం ప్రయత్నాలున్నాయి. ఎన్నికల్లో వైసీపీ, కూటమిల మధ్యే పోటీ కాకుండా JSP,TDPల మధ్య పోరు ఉండనుంది.
News February 20, 2026
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: మెదక్ కలెక్టర్

10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో ప్రత్యేక తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. బట్టి పద్ధతికి దూరంగా ఉండి అంశాలపై పట్టు సాధించాలని, ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.


