News January 17, 2026
హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 19, 2026
ప్రేయసితో ❤️ పెళ్లికి సిద్ధమైన ధవన్.. ఫొటోలు వైరల్

IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ప్రేయసి సోఫీ షైన్(ఐర్లాండ్)తో పెళ్లికి సిద్ధమయ్యారు. నిన్న సంగీత్ వేడుకల ఫొటోలను SMలో షేర్ చేయగా వైరలవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా AUSకు చెందిన ఆయేషాను ధవన్ 2012లో వివాహం చేసుకొని 2023లో విడాకులు తీసుకున్నారు.
News February 19, 2026
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: ASF కలెక్టర్

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం ASF కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి మండలాల గిరిజన గ్రామాలకు తాగునీటిని సక్రమంగా అందించేందుకు పైపులైన్లు, పంప్‌హౌస్‌ల మరమ్మతులు నెలలో పూర్తి చేయాలని సూచించారు.
News February 19, 2026
ఖమ్మం: పీఎం శ్రీ పాఠశాలల పురోగతిపై సమీక్ష

ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల పురోగతిపై కేంద్ర బయోటెక్నాలజీ శాఖ జాయింట్ సెక్రటరీ ఏక్తా విష్ణోయి సమీక్షించారు. గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి జిల్లాలోని 28 పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’, ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుపై అధికారులను అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత, విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


