News September 8, 2025

హైదరాబాద్‌కు గోదావరి.. నేడే పునాది

image

భవిష్యత్‌లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌‌కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు ఉస్మాన్‌సాగర్‌ వద్ద శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News September 9, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: జాయింట్ కలెక్టర్

image

యూరియా ఎరుకుల కోసం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్‌తో కలిసి ఎరువుల పరిస్థితి పరిశీలించారు. రైతులు మంచి ప్రయోజనాలు కలిగిన నానో యూరియాను వినియోగించాలని కోరారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలు ధాన్యం కొనుగోళ్లపై కూడా మాట్లాడినట్లు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ తెలిపారు.

News September 9, 2025

తాడేపల్లిలో రేపు జగన్ మీడియా సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

News September 9, 2025

విద్యార్థి సమస్యలపై సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ ఉండాలి: కలెక్టర్

image

అమలాపురం కలెక్టరేట్ భవన్‌లో మంగళవారం ఆర్‌ఎస్‌యూ స్టూడెంట్ యూనియన్ పదవ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంటేపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఎప్పటికప్పుడు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థి సంఘాలు సమాజ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.