News August 23, 2025

హైదరాబాద్‌కు ‘HILLS’ ఇదీ రోడ్ల పరిస్థితి!

image

HYDలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే తెలియని వారు ఉండరు. భారీ బిల్డింగ్‌లు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ అందాలకు ఈ ఏరియాలు మారుపేరు. ధనికులు ఉండే ప్రాంతంగానూ పేరు పొందింది. కానీ.. ఇప్పుడు బంజరాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రహదారులు గుంతల మయంగా మారి, అధ్వాన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు జీహెచ్ఎంసీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12 పరిస్థితికి అద్దంపట్టే రోడ్డు ఫొటో.

Similar News

News August 23, 2025

సిద్దిపేట: లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం!

image

లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు జిల్లాలో వినవస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న మేస్త్రి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన సిద్దిపేట హౌసింగ్ ఏఈ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇంకొందరు అవినీతిపరులు ఉన్నారని వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News August 23, 2025

కంటిచూపు కోల్పోయిన హోంగార్డుకి సీపీ సాయం

image

విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన ఓ హోం గార్డుకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అండగా నిలిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ హై బీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీపీ శుక్రవారం అందించారు. ప్రస్తుతం శివకుమార్‌కు కంటిచూపు వచ్చింది. కాగా, ఆయన నిన్ననే తిరిగి విధుల్లో చేరారు.

News August 23, 2025

రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం

image

మణుగూరు గుట్ట మల్లారం వద్ద గల రథం గుట్ట ప్రాంతాన్ని జిప్ లైన్ అడ్వెంచర్ బృందం శుక్రవారం పరిశీలించింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మార్చుటకు పరిశీలనకు వచ్చామని బృందం సభ్యులు తెలియజేశారు. మణుగూరు రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు.