News December 16, 2025

హైదరాబాద్‌కు IIM మంజూరు చేయండి: CM

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని TG సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలను కోరారు. 105 YIIRSలు నిర్మిస్తున్నామని, వీటితో 4 లక్షల మందికి మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఇందుకు రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని, ఈ మొత్తానికి తీసుకునే రుణాలను FRBM నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. అటు హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.

Similar News

News April 14, 2026

33 శాతం రిజర్వేషన్ ఆలస్యమైతే మహిళలకు అన్యాయం: మోదీ

image

చట్ట సభల్లోనూ మహిళలు బలంగా గళమెత్తేందుకు సమయం వచ్చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. వారికి 33 శాతం సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశంలోని నారీమణులకు లేఖ రాశారు. ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును ప్రవేశపెడతామన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే మహిళలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు.

News April 14, 2026

పసికూనపైనే కసికూన అరంగేట్రం!

image

అనుకున్నట్టే వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులోకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జూన్‌లో జరిగే <<19624839>>ఐర్లాండ్<<>> టీ20 సిరీస్‌కు BCCI తాజాగా అతడి పేరును షార్ట్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనే తరువాయి కానుంది. ఇదే జరిగితే జాతీయ జట్టులో చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టనున్నారు. ఇక పసికూన ఐర్లాండ్‌పై ఈ కసికూన ఎలా చెలరేగుతాడో చూడాలి.

News April 14, 2026

పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

image

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.