News March 26, 2024

హైదరాబాద్‌లోనే TB కేసులు అధికం

image

TB కేసులు గ్రేటర్‌ HYDలో పెరుగుతూనే ఉన్నాయి. 2023‌లో TGలో 73,212 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఇందులో 20 శాతం కేసులు HYDలోనే నమోదు కావడం ఆందోళనకరం. తర్వాతి స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో 15 నుంచి 44 ఏళ్ల‌ మధ్య ఉన్నవారే ఎక్కువని వెల్లడించారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు వీటి లక్షణాలు. SHARE IT

Similar News

News January 9, 2025

HYD: రూ.7,104 కోట్లతో RRR టెండర్.. స్పెషల్ ఫోకస్

image

HYD శివారు ORR బయట RRR ఉత్తర భాగాన్ని 5 ప్యాకేజీలుగా 160 కిలోమీటర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రూ.7104 కోట్లతో ఈ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే మార్కింగ్ పనులు జరిగాయి. టెండర్ బిడ్ల దాఖలు గడువు ఫిబ్రవరి 14 వరకు ఉన్నట్లుగా తెలిపారు. 17వ తేదీన టెండర్లను తెరువనున్నారు. మరోవైపు దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

News January 9, 2025

HYD: పొగ మంచులో డ్రైవ్ చేస్తున్నారా..? ఇవి పాటించండి!

image

✓పొగమంచులో వేగం తగ్గించి వాహనం నడపండి
✓హై బీమ్ బదులు,లో బీమ్ హెడ్ లైట్ వాడండి
✓కార్లలో ఏసీ ఆన్ చేసి ఉంచుకోండి
✓ఓవర్ టేక్ చేయడం బంద్ చేయండి
✓జంక్షన్లు, టర్నింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
✓సైకిలిస్టులు, పాదచారులను గమనించండి
✓పొగమంచు అధికంగా ఉన్నప్పుడు ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిది
✓పొగమంచులో డ్రైవింగ్ చేసినప్పుడు ఈ సూచనలు పాటించాలని రాచకొండ పోలీసులన్నారు.

News January 9, 2025

శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.