News January 3, 2026
హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ కార్గో టన్నెల్స్

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే న్యూస్ బాస్. ట్రాఫిక్ జామ్‌లు చూసి తల పట్టుకుంటున్నారా? అందుకే NHAI ఒక క్రేజీ స్కెచ్ వేసింది. మన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కుల నుంచి భారీ వాహనాలను నేరుగా పంపేందుకు ‘అండర్‌గ్రౌండ్ కార్గో టన్నెల్స్’ నిర్మించబోతున్నారు. అంటే రోడ్డుపైన మనం రయ్యిమని దూసుకుపోవచ్చు. భారీ కంటైనర్లు మాత్రం నేల లోపలి నుంచే సైలెంట్‌గా వాటి డెస్టినేషన్‌కి వెళ్తాయి.
Similar News
News February 9, 2026
GHMCలో అధికారం రేపటితో లాస్ట్

2021 ఫిబ్రవరి 11 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు.. అంటే సరిగ్గా 5 ఏళ్లు.. ఈ ఐదేళ్లలో అధికారం అనుభవించారు. 12 నుంచి మాజీలవుతారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు రేపటితో ముగియనుండటంతో కార్పొరేటర్లందరూ మాజీ కార్పొరేటర్లుగా చెలామణి అవుతారు. మేయర్, డిప్యూటీ మేయర్ మాజీలుగా మారిపోతారు. మహానగరం మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్తుంది.
News February 9, 2026
HYDలో తీవ్ర విషాదాలు..!

HYDలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చర్లపల్లిలో పిల్లలతో కలిసి విజయారెడ్డి డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీనికి ముందు యువతి డిప్రెషన్‌తో ట్యాంక్‌బండ్‌లో దూకింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీశ్ పనిఒత్తిడితో ఉరేసుకున్నాడు. కూకట్‌పల్లిలో వివాహిత అనిత అనారోగ్యంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఒత్తిడికి గురైతే పిల్లలు, తల్లిదండ్రులతో గడపాలని నిపుణులు చెబుతున్నారు.
News February 9, 2026
హైదరాబాద్ మెట్రో.. క్రియేటివ్ రీల్స్ అడ్డా!

HYD మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, యువత క్రియేటివిటీకి సరికొత్త వేదికలుగా మారుతున్నాయి. రాయదుర్గం నుంచి ఎల్బీనగర్ వరకు సాగే ప్రయాణంలో రీల్స్ షూటింగ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనతో కుర్రకారు హల్చల్ చేస్తోంది. క్లబ్‌లు, కేఫ్‌ల కంటే మెట్రోలోనే నెట్‌వర్కింగ్ జోన్లు వెలుస్తున్నాయి. ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా వైరల్ వీడియోలు సృష్టిస్తూ మెట్రోను ఒక క్రియేటర్ స్టూడియోగా మార్చేస్తున్నారు.


