News January 3, 2026

హైదరాబాద్‌లో అంతా ఆన్‌లైన్‌లోనే!

image

GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్‌, ట్రేడ్ లైసెన్స్‌ ఫీజుల చెల్లింపులు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌‌లోనే జరగాలని GHMC స్పష్టం చేసింది. నగదు లావాదేవీలకు పూర్తిగా చెక్‌ పెట్టినట్లు ప్రకటించింది. UPI, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌‌తో చెల్లింపులు స్వీకరిస్తామని తెలిపింది. కొత్త విధానానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఇకపై ఒకే పన్ను వసూలు విధానం అమల్లోకి వచ్చింది.

Similar News

News January 3, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇద్దరి మధ్య 2-2-2 Bonding

image

HYD బిజీ లైఫ్‌లో ప్రేమకు సమయం దొరకడం దంపతులకు కష్టమవుతోంది. వీరికి ‘2-2-2 రూల్’ కొత్త దారి చూపిస్తోందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక డేట్‌, 2 నెలలకు ఓ వీకెండ్‌ ట్రిప్, 2 ఏళ్లకు ఒక దీర్ఘ విహారం కలిసి చేయాలనే ఈ సూత్రం అనుబంధాన్ని బలపరుస్తుంది. కలిసి గడిపే సమయం పెరగడంతో భావోద్వేగ అనుబంధం బలపడుతుందనేది 2-2-2 సందేశం. చిన్న ప్రణాళికలతో పెద్ద మార్పు సాధ్యం అంటున్నారు.

News January 3, 2026

దద్దరిల్లనున్న హైదరాబాద్

image

సంక్రాంతి వస్తే సిటీలో పతంగ్ ఎగరాల్సిందే. గల్లీలో పెద్ద బిల్డింగ్ ఒక్కటి ఉంటే చాలు. చరాక్‌కు షాదీ, మాంజా చుట్టి బిల్డింగ్ ఎక్కాల్సిందే. ఆకాశంలో పోటీ పడుతోన్న గాలిపటాలు చూసిన ఆ క్షణం వైబ్ వేరు. పేంచ్‌లు వేస్తూ గాలిపటాలతో యుద్ధం చేస్తుంటారు. దోస్తులంతా కలిసి చేసుకునే దావత్ మామూలుగా ఉండదు. మందు, మాంసంతో బలగం చేసే సందడి జాతరను తలపిస్తుంది. ‘కాటే పతంగ్’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.

News January 3, 2026

హైదరాబాద్‌లో కొత్త జిల్లా ఇదే?

image

ఏంది భయ్యా.. మన జిల్లా మారుతుందంట కదా?.. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. పరిపాలనను పరుగులు పెట్టించేందుకు GHMC ప్రాతిపదికన జిల్లాల రీ-ఆర్గనైజేషన్‌కు స్కెచ్ వేస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులను చెరిపేసి, ఆరు జోన్ల ఫార్ములాతో కొత్త రూపు ఇవ్వాలని చూస్తున్నారు. ఉప్పల్‌ను మల్కాజిగిరిలో కలిపి ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్?