News April 17, 2025
హైదరాబాద్‌లో ఆందోళనలు.. పోలీసుల అప్రమత్తం!

నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.
Similar News
News December 13, 2025
‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

TG: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో 3 స్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్‌లకు HYD పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ‘డ్రగ్స్ దొరికితే యాజమాన్యానిదే బాధ్యత. పార్కింగ్ సహా అంతటా CCTVలు ఉండాలి. బయట రా.10 గం.కు సౌండ్ సిస్టమ్ ఆపాలి. లోపల 45 డెసిబుల్స్‌తో ఒంటిగంట వరకే అనుమతి. డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10 వేలు ఫైన్, 6నెలల జైలు/లైసెన్స్ రద్దు. తాగిన వారికి డ్రైవర్లు/క్యాబ్‌లు నిర్వాహకులే ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు.
News December 13, 2025
డెల్టా హాస్పిటల్స్‌లో 100 రోజుల్లో 60 రోబోటిక్ శస్త్రచికిత్సలు

రాజమండ్రిలోని డెల్టా హాస్పిటల్స్‌లో కేవలం 100 రోజుల్లో 60కి పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్టు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి (ఎంఎస్ సర్జన్) తెలిపారు. గాల్ బ్లాడర్, హెర్నియా, గర్భాశయ, బేరియాట్రిక్, థైరాయిడ్ శస్త్రచికిత్సలను ఈ ఆధునిక పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సాంకేతికత వలన పేషెంట్లు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో త్వరగా కోలుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
News December 13, 2025
పల్నాడు: మల్లమ్మ సెంటర్‌కు ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా..!

నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు. వినుకొండ, సత్తెనపల్లి, పల్నాడు, గుంటూరు వెళ్లే 4 మార్గాలను కలిపే కూడలిని మల్లమ్మ సెంటర్ అంటారు. ఈ కూడలిలో చందనం మల్లమ్మ 1945లో మిఠాయి దుకాణం ప్రారంభించారు. ఆమె చేసిన మిఠాయిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకెళ్లటంతో మల్లమ్మ షాపు ప్రజలకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పెద్ద బజారుగా ఉన్న ఆ కూడలికి 1970 నుంచి మల్లమ్మ సెంటర్‌గా వాడుకలోకి వచ్చింది.


