News August 3, 2024

హైదరాబాద్‌లో ఇక సందడే.. సందడి

image

మూడంతో 3 నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ రానుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30వ తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, శ్రావణ మాసం SEP3తో ముగుస్తుంది.

Similar News

News November 10, 2025

HYD: హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

image

నిజాంపేట మున్సిపాలిటీలోని కోశల్యానగర్‌లో హైడ్రా కాపాడిన 300 గజాల బనియన్ ట్రీ పార్కులో స్థానికులు కార్తీకమాసం సందర్భంగా వనభోజనాలు నిర్వహించారు. ఆక్రమణదారులు కబ్జా చేసిన ఈ పార్కును హైడ్రా రక్షించి కాలనీవాసులకు అప్పగించింది. దీంతో కృతజ్ఞతగా వెయ్యి మంది నివాసితులు పార్కులో సత్యనారాయణ వ్రతం ఆచరించారు. పిల్లలు, పెద్దలు ‘హైడ్రా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు.

News November 9, 2025

HYD: రమణీయం.. ఈ సూర్యాస్తమయం

image

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్‌ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సులు మరిచిపోలేరు.

News November 9, 2025

శంషాబాద్: మూడు విమానాలు రద్దు

image

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్‌ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.