News April 18, 2024

హైదరాబాద్‌లో‌ ఇవి FAMOUS

image

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన హైదరాబాద్‌. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్‌, మాల్వాల ప్యాలెస్‌లు ఉన్నాయి. కళా ప్రపంచంలో సలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్‌ షాషీ టూంబ్స్‌, మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్‌ HYD చరిత్రకు ఆనవాళ్లు. నేడు World Heritage Day

Similar News

News September 11, 2025

HYD: మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

image

వ‌ర్షాకాలం వ‌ర‌ద పోయేందుకు వీలుగా మ్యాన్‌హోళ్ల మూత‌లు తెర‌వ‌డం, వ‌ర‌ద త‌గ్గ‌గానే వాటి తిరిగి మూసేస్తున్నట్లు హైడ్రా తెలిపింది. మూత తెరిచి ఉన్న దగ్గర సిబ్బంది ఉండేలా చూస్తామని, ఒక వేళ ఎక్క‌డైనా పొర‌పాటున మ్యాన్‌హోల్ మూత తెర‌చి ఉంటే 9000113667 నంబ‌రుకు కాల్ చేసి తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది.

News September 11, 2025

29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.

News September 11, 2025

HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.