News February 5, 2025

హైదరాబాద్‌లో ఎవరి బలం ఎంత?

image

HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.

Similar News

News November 14, 2025

Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో 42 బూత్‌లలో పోలైన ఓట్లను లెక్కించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్‌కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.