News April 15, 2025
హైదరాబాద్‌లో ఒలంపిక్ పతక విజేత సందడి

TG రెజ్లర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని ఒలంపిక్ పతక విజేత రవికుమార్ దహియా అన్నారు. HYDలో జరుగుతున్న తెలంగాణ కేసరి కుస్తీ పోటీలను తిలకిచ్చేందుకు వచ్చిన ఆయన జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. ఇటీవల గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన వజ్రాభరణాన్ని తిలకించారు. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించే వారు హరియాణా నుంచే వస్తున్నారని ప్రభుత్వం ప్రోత్సహిస్తే తెలంగాణ రెజ్లర్లు రాణిస్తారన్నారు.
Similar News
News July 7, 2025
‘నగరాలు’ కులస్థులకు BC-D కులపత్రాలు: సవిత

AP వ్యాప్తంగా ఉన్న నగరాలు సామాజిక వర్గీయులను BC-Dలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు మంత్రిని కలిసి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. తమ వర్గీయులకు BC-D కాస్ట్ సర్టిఫికేట్ అందించాలనే GO ఉన్నా, కేవలం VZM, SKLM, విశాఖ, కృష్ణా జిల్లాల్లోనే ఇది అమలవుతోందని వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
News July 7, 2025
KU పరిధిలో 2,356 సీట్లు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.
News July 7, 2025
ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ ఎవరో తెలుసా?

1972లో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. తొలి కలెక్టర్‌గా కత్తి చంద్రయ్య వ్యవహరించారు. నాగులుప్పులపాడు(M) పోతవరంలో 1924 జులై 7న ఆయన జన్మించారు. మద్రాసులో లా పూర్తి చేసి మధురై జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు కలెక్టర్‌గానూ వ్యవహరించారు. ఆయన కుమారుడు, కుమార్తె రత్నప్రభ, ప్రదీప్ చంద్ర సైతం IASలే. తండ్రి, కుమారుడు ఒకే జిల్లా(గుంటూరు)కు కలెక్టర్‌గా పనిచేయడం మరొక విశేషం.