News January 31, 2026
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

TG: హైదరాబాద్‌లోని కోఠి SBI కార్యాలయం వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ATMలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్దనున్న రూ.6 లక్షలు దోపిడీ చేశారు. కాల్పుల్లో రిషద్ కాలికి గాయం కాగా.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులు CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Similar News
News February 19, 2026
షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,290 పెరిగి ₹1,56,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹2,100 ఎగబాకి ₹1,43,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా ₹10 వేలు పెరిగి ₹2,70,000గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
News February 19, 2026
రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
News February 19, 2026
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 83,762 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 25,831 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో HCL, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ షేర్లు లాభాల్లో.. ఇండిగో, KWIL, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


