News December 23, 2025

హైదరాబాద్‌లో కృష్ణా జిల్లా వ్యక్తి గంజాయి దందా

image

HYD గచ్చిబౌలిలోని ఓ పీజీ హాస్టల్ వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల గుట్టును రాయదుర్గం పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం రట్టు చేసింది. కృష్ణా (D) పెదపారుపూడికి చెందిన కంభు వంశీ, చీరాల వాసి బాలప్రకాశ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ముందుగా విజయవాడకు, అక్కడి నుంచి HYDకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు.

Similar News

News December 30, 2025

EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండాలి: కలెక్టర్

image

EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉన్న EVM నిల్వ కేంద్రాన్ని త్రైమాసిక తనిఖీ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో కలెక్టర్‌తో పాటు పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాలన్నారు.

News December 29, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.