News December 9, 2025
హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ’మీనింగ్‌ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్‌తో మైమరిచిపోతున్నారు. ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.
News December 17, 2025
రూపాయి పతనమైతే సామాన్యుడికి ఏంటి సమస్య?

రూపాయి విలువ పడిపోతే తమపై ఏ ప్రభావం ఉండదని సామాన్యులు అనుకుంటారు. ప్రత్యక్షంగా లేకున్నా ఎగుమతి, దిగుమతుల ఖర్చులు పెరగడంతో మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి RBI వడ్డీ రేట్లు పెంచితే లోన్ల EMIలు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లపై ప్రభావం పడుతుంది. రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయి. బోనస్, వేరియబుల్ పే తగ్గే ఛాన్స్ ఉంది.
News December 17, 2025
చెన్నూరు: మ:1గంట వరకు 87.84%ఓటింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు మండలంలో 3వ విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 87.84% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో మొత్తం 26,102 మంది ఓటర్లు ఉండగా, 22,967 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మండల ఎన్నికల అధికారి వివరించారు.


